కరోనా వైరస్ వ్యతిరేకంగా చిరంజీవి, నాగార్జున పాట..nag
2020-03-30 07:29:04

కరోనా వైరస్ ను అరికట్టడానికి ఎవరికి తోచిన పద్ధతి వారు ఫాలో అవుతున్నారు. ప్రభుత్వాలు సినీ ప్రముఖులు ప్రజలు బయటికి రాకుండా ఉండాలని కోరుతున్నారు. ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని దేశ సేవ చేయాల్సిన సమయం వచ్చేసింది.. చేసేయండి అంటూ చాలా మంది సెలబ్రిటీలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి కరోనా వైరస్ ను అరికట్టడానికి ఒక పాట రూపొందించారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి ఈ పాటను స్వరపరిచాడు. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించాడు. వి ఫైట్ విత్ కరోనా.. వి కిల్ కరోనా అంటూ సాగే ఈ పాటలో చిరంజీవితో పాటు నాగార్జున సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. మరోవైపు కోటి గిటార్ తో ప్లే చేశాడు. ఆయనే పాడాడు కూడా. ఎవరికి వాళ్ళు తమ ఇంట్లో ఉండి ఈ పాటను షూట్ చేసి పంపించారు. సోషల్ మీడియాలో ఇది బాగానే వైరల్ అవుతుంది. తెలుగు సినిమా పెద్దలు కార్మికులను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీ మొదలుపెట్టారు. దీని కోసమే ఈ పాటను షూట్ చేశారు. ఇప్పటికే దీనికి చాలా మంది హీరోలు భారీ విరాళాలు ఇచ్చారు.. ఇంకా ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి కోరాడు. ఎప్పుడూ మన కోసం కష్టపడే సినిమా కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకునే సమయం వచ్చింది అంటున్నాడు మెగాస్టార్. చిరంజీవి చెప్పడంతో చాలా మంది హీరోలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారు.

More Related Stories