అర్జున్ సురవరానికి మెగా సపోర్ట్....పర్మిషన్ ఇస్తారాchiru
2019-11-24 07:34:59

కుర్రహీరో నిఖిల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాని టి.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. నిజానికి నిఖిల్ కి ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత సరైన హిట్ అనేదే లేదు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని టైం తీసుకొని మరీ ముద్ర అనే సినిమా చేశాడు. టైటిల్ క్లాష్ కావడంతో ముద్ర సినిమా కాస్తా అర్జున్ సురవరంగా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే అర్జున్ సురవరం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ అది గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఇటీవల ‘అర్జున్ సురవరం’ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతుండగా నవంబర్ 26 న, హైదరాబాద్, నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తాజాగా నిఖిల్, నిర్మాత రాజ్ కుమార్ ఆకెళ్ల మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానించారు. నిజానికి అక్కడే జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి పవన్ ని గెస్ట్ గా పిలిచారు, సెక్యూరిటీ ఇబ్బంది అంటూ ఆ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఈ ఈవెంట్ కి ఏమి చేస్తారో చూడాలి. ఇక నిఖిల్ తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న కార్తికేయ 2 ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలెట్టనున్నారని అంటున్నారు.

More Related Stories