నిర్మాత కృష్ణ మోహన్ రావు మరణం బాధించింది: చిరంజీవి

2021-03-25 00:07:27
ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సోదరుడు కోవెలమూడి కృష్ణమోహన్ రావు గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కృష్ణమోహన్ రావు బుధవారం మధ్యహ్నం స్వర్గస్థులయ్యారు.కృష్ణ మోహన్ రావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ-``నేను నటించిన యుద్ధభూమి చిత్రాన్ని ఆయన నిర్మించారు. అలాగే ఇద్దరు మిత్రులు చిత్రాన్ని కూడా తన సోదరులు కె రాఘవేంద్రరావుతో కలిసి ఆయన నిర్మించారు. కృష్ణ మోహన రావు వండర్ ఫుల్ పర్సన్.. ఆయన లేని లేటు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..`` అన్నారు.