సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి..chiranjeevi
2020-04-01 00:20:04

లేట్‌గా వచ్చినా కూడా లేటెస్టుగా రావడం అంటే ఇదే మరి. సోషల్ మీడియాకు ఇన్నేళ్లు దూరంగా ఉన్నాడు మెగాస్టార్. కానీ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఈయన దూకుడు ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఇన్ని రోజులు ఎంతమంది ఉన్నా కూడా ఇన్ని ట్వీట్స్ చేయలేదేమో అనిపిస్తుంది చిరు జోరు చూస్తుంటే. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు ఈయన. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ముందుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి అభిమానులకు చెబుతున్నాడు చిరంజీవి. 

కరోనా క్రైసిస్ ఛారిటీ గురించి కూడా చిరంజీవే చెప్పాడు. దాంతో పాటు ప్రతీ విషయం కూడా అందరికీ వివరిస్తున్నాడు. తనకు స్వాగతం పలికిన వాళ్లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు మెగాస్టార్. ఇప్పుడు సినిమా అప్ డేట్స్ కూడా పంచుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు టైమ్ వచ్చేసిందని తెలుస్తుంది. నిజానికి ఈ చిత్ర టైటిల్ లాంఛ్ కోసం పెద్ద ఈవెంట్ చేయాలనుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. 

కానీ చిరంజీవి మాత్రం అనుకోకుండా మొన్నామధ్య ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పేసాడు. దాంతో ఇప్పుడు మెగాస్టార్ లుక్ ఉగాదికి విడుదల చేద్దామని అనుకున్నా అదే రోజు ఆయన ట్విట్టర్ ఎంట్రీ అనుకున్నాడు. దాంతో కొరటాల తన ఆలోచనను మార్చుకుని ఇప్పుడు శ్రీ రామనవమి రోజు ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలని ఎంత అనుకుంటున్నా కూడా పరిస్థితులు అయితే సహకరించడం లేదు. కచ్చితంగా ఆచార్య వచ్చే ఏడాదికి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories