పవన్ కళ్యాణ్ కోసం చిరు రాజకీయాలు వదిలేసాడా...Chiranjeevi
2020-03-05 11:11:39

మొన్నటి వరకు ఒక కన్ఫ్యూజన్.. ఇప్పుడు మరో కన్ఫ్యూజన్.. నాగబాబు మాట్లాడిన తర్వాత మెగాభిమానుల్లో మరింత ఎక్కువైపోయింది. ఇన్ని రోజులు చిరంజీవి రాజకీయాలు వద్దనుకుని బయటికి వచ్చేసాడని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మాత్రం నాగబాబు మరో విషయం చెప్పాడు. పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య చిరంజీవి రాజకీయాలు త్యాగం చేసాడని ఈయన చెబుతున్నాడు.

ప్రస్తుతం ఈయన ఒక్క జనసేనకు తప్ప మరే పార్టీకి సపోర్ట్ చేయడం లేదని చెప్పాడు నాగబాబు. అది కూడా తమ్ముడు కాబట్టి చిరంజీవి ఈ పార్టీకి అండగా ఉన్నాడని తెలియజేసాడు మెగా బ్రదర్. అన్నయ్య ఉద్దేశం ఏంటంటే.. రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదని చెప్పుకొచ్చాడు నాగబాబు. ఎవరో ఒక్కరే అక్కడ ఉండాలి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు అక్కడ పని లేదని తెలిసి వచ్చేసాడని చెబుతున్నాడు నాగబాబు. తనకంటే కూడా రాజకీయాల్లో పవన్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని చిరంజీవి చెప్పినట్లు చెప్పాడు నాగబాబు. 

పవన్ బాగుండాలంటే తాను రాజకీయాల్లో ఉండకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశాడని తెలిపాడు ఈయన. పైగా చిరంజీవి చేసింది త్యాగం అని ఎందుకు అన్నానంటే.. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడని అన్నయ్య అనుకున్నాడని నాగబాబు మీడియాకు తెలిపాడు. అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడని ఈయన కన్ఫర్మ్ చేసాడు. ఇలాంటి సమయంలో అనవసరంగా మళ్లీ రాజకీయాల్లోకి ఆయన్ని లాగొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు నాగబాబు. 

ఆయన నిర్ణయాన్ని కుటుంబం మొత్తం స్వాగతించామని.. చిరంజీవి ఒక రాజకీయ పార్టీ నుంచి రాజ్యసభ సీటు వస్తుందని వచ్చిన వార్తలను పూర్తిగా అబద్ధమని.. దాన్ని ఎప్పటినుంచో ఖండించాలని అనుకున్నానని ఇప్పుడు సరైన సమయమని చెప్పాడు నాగబాబు. మొత్తానికి పవన్ కోసమే చిరంజీవి రాజకీయాలు వదిలేసాడు.. త్యాగం చేసాడని చెప్పడం మాత్రం కాస్త కామెడీగానే అనిపిస్తుంది. 

More Related Stories