ఈ సినిమాకు వచ్చే ఆదరణ చిత్ర పరిశ్రమకే స్ఫూర్తి..మెగాస్టార్



Chiranjeevi
2020-12-23 14:46:40

సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న "సోలో బతుకే సో బెటర్" సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  కాగా మూతపడిన థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదలయ్యే మొదటి సినిమా గా ఈ సినిమా  వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను ఆదరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. "ఈ క్రిస్మస్ విడుదలవుతున్న "సోలో బతుకే సో బెటర్" టీమ్ కు నా శుభాకాంక్షలు. లాక్ డౌన్ తరవాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక ముజ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమకు స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో సందేహంలేదు. 

అలాగే ప్రేక్షకులు బాధ్యతగా ఫేస్ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను" అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నబా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత థియేటర్ లో విడుదల అవుతున్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More Related Stories