నా తమ్ముడు సాధిస్తాడు.. పవన్‌పై చిరంజీవి నమ్మకం..chiru
2020-04-24 08:36:17

తాను సాధించలేనిది తమ్ముడు సాధిస్తాడని చెబుతున్నాడు చిరంజీవి. ఏదో ఒకరోజు కచ్చితంగా తాను అనుకున్నది రీచ్ అవుతాడనే నమ్మకం అందరిలోనూ ఉందని చెప్పాడు మెగాస్టార్. పవన్ కళ్యాణ్ కోసమే అన్నయ్య చిరంజీవి రాజకీయాలు త్యాగం చేసాడని నాగబాబు ఆ మధ్య చెప్పాడు. ప్రస్తుతం ఈయన ఒక్క జనసేనకు తప్ప మరే పార్టీకి సపోర్ట్ చేయడం లేదని చెప్పాడు నాగబాబు. అది కూడా తమ్ముడు కాబట్టి చిరంజీవి ఈ పార్టీకి అండగా ఉన్నాడని తెలియజేసాడు మెగా బ్రదర్. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చెప్పాడు. తన తమ్ముడు జనసేన పార్టీకి కుటుంబం అంతా అండగా ఉంటుందని స్పష్టం చేసాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధమే అంటున్నాడు ఈ అన్నయ్య.

రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదని.. ఎవరో ఒక్కరే అక్కడ ఉండాలని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు అక్కడ పని లేదని తెలిసి బయటికి వచ్చేసాడని ఆ మధ్య చెప్పాడు నాగబాబు. తనకంటే కూడా రాజకీయాల్లో పవన్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని చిరంజీవి చెప్పినట్లు చెప్పాడు నాగబాబు. పవన్ బాగుండాలంటే తాను రాజకీయాల్లో ఉండకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశాడని తెలిపాడు ఈయన. పైగా చిరంజీవి చేసింది త్యాగం అని ఎందుకు అన్నానంటే.. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడని అన్నయ్య అనుకున్నాడని నాగబాబు మీడియాకు తెలిపాడు. అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడని ఈయన కన్ఫర్మ్ చేసాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి కూడా ఇదే చెప్తున్నాడు.

More Related Stories