21 రోజులు కొత్త ఉద్యోగం చూసుకున్న చిరంజీవి..  Chiranjeev
2020-03-27 17:08:00

మెగాస్టార్ చిరంజీవి ఏంటి.. కొత్త ఉద్యోగం చూసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే చేస్తున్నాడు చిరు. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా జోరు తట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు. కొత్తగా వచ్చాననే ఉత్సాహమో ఏమో కానీ ప్రతీ విషయం కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు మెగాస్టార్. మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను మోత మోగించేస్తున్నాడు చిరు. ప్రతీ చిన్న విషయం కూడా ఫ్యాన్స్ కు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. 

పొద్దున్నే లేవగానే తన ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పడుతున్నాడు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కావడంతో పని వాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకే అందర్నీ ఇంటికి పంపేసి.. తన పనులు తానే చేసుకుంటున్నాడు చిరంజీవి. మొక్కే కదా వదిలేస్తే అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు చిరంజీవి. తనకు ఇంక ఈ 21 రోజులు ఇదే ఉద్యోగం అంటూ చెప్పాడు ఈయన. ఇంట్లో వాళ్లతో సమయం గడపడం.. మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవడం.. మధ్యలో ఇలా చెట్టకు నీళ్లు పట్టడంతో రోజు గడిచిపోతుందంటున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

More Related Stories