చిరంజీవి కొత్త లుక్ అదిరిందిగా.. రామ్ చరణ్‌తో కలిసి..Chiranjeevi
2020-01-24 18:51:38

చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. తనను తాను చాలా మార్చుకుంటున్నాడు మెగాస్టార్. ముఖ్యంగా ఇప్పుడు కొరటాల సినిమా కోసం మరోసారి మారిపోయాడు మెగాస్టార్. ఈయన లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొరటాల సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు చిరు. ఇందులో చిరంజీవి లుక్ అదిరిపోయింది. 

తాజాగా బయటికి వచ్చిన ఓ ఫోటోలో చిరంజీవి, రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయి. కొరటాల సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా భారీ అంచనాలున్నాయి. భరత్ అనే నేను తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. చిరంజీవి ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాడు. అందుకే షూటింగ్ కు ఆలస్యం అయింది. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌. 

ఇదిలా ఉంటే సినిమా సినిమాకు రెండేళ్లు తీసుకోవడం కొరటాలకు అలవాటుగా మారిపోయింది. దాంతో ఈ దర్శకుడికి ఇప్పుడు డెడ్ లైన్ ఇచ్చాడు మెగాస్టార్. తన సినిమాను కేవలం 99 రోజుల్లోనే తీయాలని అందరిముందు మాట తీసుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో దేవాదాయ శాఖలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పబోతున్నాడు దర్శకుడు కొరటాల. దీనికోసం కథ కూడా చాలా పకడ్భందీగా పూర్తి చేసాడు. చిరంజీవి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీసే పాత్ర ఇది అంటున్నాడు దర్శకుడు కొర‌టాల. 

చిరు ఇమేజ్ కు తగ్గట్లుగానే ఈ చిత్ర కథ సిద్ధమైంది. షూటింగ్ అంతా కేరళ, హైదరాబాద్ లో ఉంటుందని.. ఎక్కడా ఫారెన్ వెళ్లేది కూడా లేదని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రం కోసం విలేజ్ సెట్ తో పాటు ప్రత్యేకంగా గుడి సెట్ కూడా వేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అదే సినిమాకు ప్రాణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. వాళ్లెవరో త్వరలోనే చెప్తామంటున్నారు మేకర్స్. 

రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి అంతా అనుకున్నట్లుగా జరిగి సినిమాను కేవలం 99 రోజుల్లోనే పూర్తి చేస్తే నిజంగానే అది అద్భుతమే.

More Related Stories