మైత్రి మూవీ మేకర్స్ తో చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే.. Chiranjeevi
2020-03-20 23:16:10

తెలుగు ఇండస్ట్రీలో మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు ఈ నిర్మాతలు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి లాంటి సినిమాలతో తమ రేంజ్ పెంచుకున్నారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాను నిర్మించారు వీళ్లు. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. నానితో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. 

ఇలాంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన సొంత బ్యానర్ లోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తో పాటు మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ లో కుర్ర దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. 

పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సబ్జెక్టు ఉండబోతుందని.. ఇప్పటికే బాబీ చెప్పిన స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయాల్సిందిగా ఆయన్ను కోరాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం నిజంగానే బాబీ జాక్ పాట్ కొట్టినట్లే. రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ.. పవన్ కళ్యాణ్ తో సర్దార్.. జూనియర్ ఎన్టీఆర్ తో జై లవ కుశ.. నాగచైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీ మామ సినిమాలు తెరకెక్కించాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు ఈ కుర్ర దర్శకుడు.  

More Related Stories