మెగాస్టార్ మరో కథను విన్నారటChiranjeevi
2021-04-19 23:24:39

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చిరు కొరటాల దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కరోనా మహమ్మారి విజృంభన తో దాదాపు అన్ని సినిమాలతో పాటు ఆచార్య షూటింగ్ కూడా వాయిదా పడింది. షూటింగ్ వాయిదా పడటానికి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ కరోనా బారిన పడటం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరవాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు.

అంతే కాకుండా లూసిఫర్ పూర్తవగానే వేదళం రీమేక్ మరియు బాబీ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేతిలో నాలుగు సినిమాలు ఉండగానే చిరు కథలు వింటున్నారట. తాజాగా దర్శకుడు వంశీపైడిపల్లి మెగాస్టార్ కు కథను వినిపించారట. మెగాస్టార్ కథ చెపుతున్న సమయంలో ఏంతో ఆసక్తికరంగా విన్నారట. దాంతో ఈ ప్రాజెక్టుకు మెగాస్టార్ ఖచ్చితంగా ఓకే చెపుతారని వంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ స్క్రిప్ట్ చిరు వయసుకు తగినట్టుగా ఉంటుందని సమాచారం. ఇక అంతా అనుకున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉండటం కూడా కాయమే.

More Related Stories