చిరంజీవి ఇంట్లో సందడి చేయబోతున్న బాలకృష్ణ.. మిగిలిన సీనియర్లు..Chiranjeevi Balakrishna Party.jpg
2019-10-26 09:26:14

మన హీరోలు, హీరోయిన్లు ఈ మధ్య ఒక కొత్త కల్చర్ కు తెరతీశారు. ప్రతి సంవత్సరం వీలైనంత వరకు తమ పాత మిత్రులను కలుసుకోవడానికి ఒక రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. గత పదేళ్లుగా ఇలా ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. ఎవరికి వీలైనప్పుడు వాళ్లు రీయూనియన్ కు వచ్చి సందడి చేస్తున్నారు. ఇందులో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా వస్తున్నారు.

1980లలో కలిసి నటించిన వాళ్లంతా ఈ రీ యూనియన్ పార్టీ చేసుకుంటున్నారు. 2009లో సీనియర్ హీరోయిన్లు రాధిక, సుహాసిని లాంటి వాళ్లు రియూనియన్ ఐడియా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఎవరో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ తమ ఇంట్లోనే ఈ వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుహాసిని, రాధిక, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్ళు ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఈ అవకాశం చిరంజీవికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆయన ఇంట్లోనే రీ యూనియన్ పార్టీ జరగబోతుంది. దీనికి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సీనియర్ హీరోలు హీరోయిన్లు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎనభైల్లో చిరంజీవికి పోటీగా తెలుగులో సంచలన విజయాలు అందుకున్న బాలకృష్ణ ఈ పార్టీకి రాబోతున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు అర్జున్, భానుచందర్, సుమన్ లాంటి ఎందరో హీరోలు ఈ రియూనియన్ పార్టీలో గెట్ టు గెదర్ కానున్నారు.

హీరోయిన్ల విషయానికి వస్తే చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన రాధిక, సుహాసినితో పాటు రాధ ఇంకొందరు కూడా ఈ రీయూనియన్ పార్టీలో సందడి చేయబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సైరా సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఈయన  తోటి హీరోలు హీరోయిన్లకు ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు. అదే ఇప్పుడు రీ యూనియన్ పార్టీ గా మారబోతుంది. త్వరలోనే ఈ పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు బయటకు రానున్నాయి.

తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలు కూడా ఈ గెట్ టు గెదర్ లో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories