భీష్మకి చిరు ప్రసంశలు..కరోనా జాగ్రత్తలు కూడాchiru
2020-03-16 13:56:57

ఒకరకంగా కరోనా అన్నిపనులను ఆపేసినా మరో రకంగా అందరికీ రెస్ట్ ఇస్తుందని చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపధ్యంలో తెలుగు సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. అందరూ రేపటి నుండి అనుకుంటే చిరంజీవి ఈరోజు  నుండే ఆపేశాడు. దీంతో చిరంజీవికి కొత్త సినిమాలు చూడటానికి సమయం దొరికింది. విడుదల సమయంలో వాటిని చూడలేకపోవడంతో ఇప్పుడు వాటిని కవర్ చేస్తున్నారు. ఈరోజే చిరంజీవి భీష్మ సినిమాని దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘటన అని, సినిమాల్లోకి రావాలనే స్ఫూర్తి నింపిన దేవుడితో కలిసి సినిమా చూస్తున్న ఈ రోజు కల నిజమైందని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు వెంకీ. చిరుతో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ...ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చింది చేతులు శుభ్రంగా కడిగిన తరువాతే అంటూ కరోనా జాగ్రత్తలు కూడా చెప్పాడు వెంకీ. ఫిబ్రవరి 21 న విడుదలైన నితిన్, రష్మిక నటించిన ‘భీష్మా’ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాని దీనిని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మించారు. ‘చలో’ చిత్రంతో అరంగేట్రం చేసిన వెంకి కుడుముల రెండో సినిమాతో హిట్ కొట్టి మంచి ఫాంలో ఉన్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా వర్షం కురిపించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులు కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా.

 

More Related Stories