నాగార్జున వైల్డ్ డాగ్ పై మెగాస్టార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు



Chiranjeevi
2021-04-05 13:23:16

అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ సినిమాకు అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎప్రిల్ 2 న విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఇక ఈ చిత్రంపై..నాగార్జున న‌ట‌న‌పై ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైల్డ్ డాగ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చిరంజీవి మాట్లాడుతూ..మంచి ప‌నులు జ‌రుగుతున్న‌ప్పుడు ఇత‌రులతో పంచుకోవ‌డం చాలా ఆనందాన్నిస్తుంది. ముందు ఈ సినిమాలో రొమాన్స్ లేకుండా..సాంగ్స్ లేకుండా తీస్తున్నారంటే డ్రై గా ఉంటుద‌న్న భావంతో చూసిన నాకు ఎంతో ఇంట్రెస్ట్ వ‌చ్చింది. ఇంట‌ర్వెల్ లేకుండా సినిమాను చూశాను. ఈ సినిమా చూసిన త‌ర‌వాత ఎందుకు సినిమా గురించి త‌క్క‌వ మాట్లాడారు అని నాగ్ కు ఫోన్ చేసి మ‌రీ అడిగాను. 

గొప్ప ఆర్టిస్టిక్ విలువ‌లు ఉన్న నాగార్జున ఈ సినిమా తీయ‌డం అభినందించ‌దగ్గ విష‌యం. అంతే కాకుండా సినిమా చూస్తున్నంత సేపు నాలో దేశ భ‌క్తి ఉప్పొంగి పోయింది. ఈ సినిమా చూస్తూ ఒక్క‌డినే క్లాప్స్ కొట్టేశారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు గూస్ బంప్స్ వ‌చ్చాయి. సినిమా మొత్తం అయ్యాక జైహింద్ అంటూ సెల్యూట్ కొట్టాల‌నిపించింది. త‌క్కువ రోజుల్లో త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు సాల్మ‌న్ ను అభినందిస్తున్నాను. చాలా మంది గొప్ప వాళ్ల గురించి బ‌య‌ట‌కు తెలియ‌దు కానీ రియ‌ల్ ఇన్సిడెంట్స్ ను ప్ర‌జ‌ల‌కు తెలిసేలా తీసిన సాల్మన్ ను మన‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్ష‌కులు ఈ సినిమాను మ‌రింత‌గా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా. అంటూ చిరంజీవి ఎమోష‌న‌ల్ అయ్యారు. 

More Related Stories