చిరంజీవి, సురేఖ.. అమెరికా 1990.. కరోనా 2020..chiru
2020-05-18 19:35:43

కాలం మారినా.. తరాలు మారినా కూడా తాను నేను ఎప్పుడూ ఒకేలా ఉంటామని చెప్తున్నాడు చిరంజీవి. తాను అంటే ఇక్కడ ఎవరో కాదు.. తన భార్య సురేఖ. ఎప్పుడు టైమ్ దొరికినా కూడా తనతో స్పెండ్ చేయడానికి యిష్టపడతానని చెప్తున్నాడు ఈయన. తాజాగా కరోనా కాలం కావడంతో చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు మెగాస్టార్. అందుకే వీలు దొరికిన ప్రతీసారి కూడా వంటింట్లోకి దూరిపోతున్నాడు. అక్కడ తన రుచులు వండి పెడుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు మెగాస్టార్.

తాజాగా వంటింట్లో ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేసాడు ఈయన. అయితే ఇక్కడే చిన్న ప్రత్యేకథ ఉంది. సరిగ్గా 30 ఏళ్ల కింద.. అంటే 1990లో హాలీడే కోసం అమెరికా వెళ్లినపుడు అక్కడ తీసిన ఫోటోను.. ఇప్పుడు తీసిన ఫోటోను పెట్టి పోస్ట్ చేసాడు చిరు. కాలం మారినా.. తాను నేను మాత్రం మారలేదని చెప్పాడు చిరు. ఈయన రొమాంటిక్ భావాలకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. అప్పుడు వంటింట్లో సురేఖతో పాటు చిరు గరిట తిప్పుతున్నాడు. సేమ్ టూ సేమ్ అలాంటి ఫోటోనే ఇప్పుడు రీ క్రియేట్ చేసారు మెగా దంపతులు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే నువ్వు కేక బాసూ అంటూ పండగ చేసుకుంటున్నారు.

 

More Related Stories