కరోనా వైరస్ మీద చిరు వీడియో..ఏదో అయిపోతుందనే భయం వద్దుchiru
2020-03-19 19:21:23

కరోనా ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. 166 దేశాలపై ఇది ప్రభావం చూపిస్తోంది. ఇటలీ సహా అనేక దేశాలు దిగ్భంధనమయ్యాయి. రెండు లక్షల మంది దీని బారిన పడ్డారు. దాదాపు ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు మొదటి వారంలో చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన కరోనా విలయతాండవం ఇప్పటికి సద్దుమణిగింది. అయితే అక్కడి నుండి బయటి దేశాలకు పాకిన ఈ వైరస్ రోజురోజుకూ తన విస్తృతి పెంచుకుంటూ పోతోంది. భారత్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య 150కి చేరింది. 16 రాష్ట్రాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. కరోనా మహమ్మారిని ఒకరినుండి ఒకరికి అంటకుండా అటు ప్రభుత్వాలు, ఇటు సెలబ్రిటీలు సైతం స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఓ వీడియో రూపొందించి కరోనా జాగ్రత్తలు వివరించారు. ఆయన ఈ వీడియోలో‘మనకు ఏదో అయిపోతుందనే భయం వద్దు, మనకు ఏమీ కాదనే నిర్లక్ష్యం వద్దు అంటూ సినిమాటిక్ గా మొదలెట్టిన ఆయన జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది అంటూ ధైర్యం చెప్పారు. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండమని ఈ తీవ్రత తగ్గే వరకు ఇంటికే పరిమితం అవడం మంచిదని చిరు సూచించారు. కరోనా కారణంగా కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి చిరు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఖాళీ సమయాల్లో మిస్సయిన సినిమాలు చూస్తూ గడుపుతున్నారు.

More Related Stories