ఆచార్య షూటింగ్ మొదలు పెట్టిన మెగాస్టార్ Chiranjeevi
2021-07-08 17:29:54

చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనా రెండో దశ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా మళ్ళీ మొదలు పెట్టారు. మెగాస్టార్ మళ్ళీ ఆచార్య సెట్లో అడుగు పెట్టారు.  హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు.  ప్రస్తుతం ఏకధాటిగా సాగే ఈ షెడ్యూల్​లో సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం రంగంలోకి దిగింది. రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ కోసం రామ్​ చరణ్‌తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్‌ గీతానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్‌, పూజాలపై చిత్రీకరించిన పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులు ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది.

More Related Stories