చిరంజీవి దాతృత్వం.. ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం



Chiranjeevi
2021-05-26 10:35:49

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఆక్సిజన్ కొరత ఏర్పడటంవల్ల ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రోగులకు ఆక్సిజన్ కొరత ఏర్పడగా.. కొంత మంది సెలబ్రెటీలు తమ వంతు సహాయంతో ఆక్సిజన్ బ్యాంక్ ను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదనే ఆశ‌యంతో చిరంజీవి ఈ మ‌హ‌త్తర కార్యాన్ని మొద‌లు పెట్టారు. అయితే ఇది నేటి నుండి మొద‌లు కానుండ‌డంతో చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేస్తూ.. మిష‌న్ మొద‌లైంది. ఇక ఆక్సిజ‌న్ దొర‌క్క చనిపోయార‌నే వార్త‌లు మ‌నం విన‌కూడ‌దు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Related Stories