నాగబాబు కామెంట్స్ మీద చిరంజీవి సమర్ధన...కానీ Chiranjeevi
2020-06-06 10:52:23

కరోనా ప్రపంచాన్ని ఒకరకంగా ఇబ్బంది పెడుతుంటే తెలుగు చిత్ర సీమను మరో రకంగా ఇబ్బంది పెడుతోంది. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్స్ ఎప్పటి నుండి పెట్టుకోవాలని జరిపిన మీటింగ్స్ మరో రచ్చ రేపాయి. కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమకు పట్టుగొమ్మలుగా ఉన్న వారు చేసిన కామెంట్స్ రచ్చ రేపుతున్నాయి. నాగబాబు, బాలకృష్ట మద్య చెలరేగిన ఈ మాటల యుద్ధం అనేక మలుపులు తిరుగుతూ అనేక మందికి ఇదే చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే కొంత మంది బాలయ్య, కొంత మంది నాగబాబు స్టాండ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరు ఎవరి స్టాండ్ తీసుకున్నారు అనేది పక్కన పడితే ఈ వివాదం మాత్రం కొంచెం చిల్లరగా తోస్తోంది. ఇప్పటి దాకా ఈ వ్యవహారం మీద ఇప్పటి దాకా చిరంజీవి స్పందించలేదు. ఆయన స్పందిస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో చిరంజీవి మాట్లాడిన పాత ఇంటర్వ్యూ ఒక దానిని వైరల్ చేస్తున్నారు.

అందులో యాంకర్ నాగాబాబు చేసిన కామెంట్స్ ను మీరు సమర్దిస్తారా ? అంటే అవును సమర్దిస్తానని, నా తమ్ముడు ఏదయినా సెన్సిబుల్ గా మాట్లడతాడని, సెన్స్ తోనే మాట్లడతాడని తాను హార్ట్ అయితే ఆ హార్ట్ అయిన దానికి కౌంటర్ గా మాట్లాడతాడు అని చిరు చెప్పుకొచ్చారు. అదే పరిస్థితి నాకు వస్తే నేను దానిని దిగమింగుకుని వదిలేస్తానని, దానిని బయటకు వ్యక్త పరచనని అది నా నేచర్ అని చిరు చెప్పుకొచ్చారు. నాగబాబు నేచర్ అది కాదని, ఎవరి జోలికి వెళ్ళని మా ఫ్యామిలీ గురించి ఎవరయినా కామెంట్ చేస్తే దానికి నాగబాబు అలాగే స్పందిస్తాడని చెప్పుకొచ్చారు. ఇక తమ కుటుంబం సాఫ్ట్ టార్గెట్ అవుతుందన్న చిరంజీవి, తాను ఏమీ అనను కాబట్టి కొందరు పని కట్టుకుని తన ఫ్యామిలీ మీద బురద చల్లుతూ ఉండచ్చని ఆయన పేర్కొన్నారు. తాను ఏమీ అనకున్నా తన అభిమానులు అడగాల్సినవి అడిగేస్తారు, కడాగాల్సినవి కడిగేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూ చిరు ఖైదీ నెం 150 రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ కి సంబందించింది.  

More Related Stories