సైరా ఫస్ట్ రివ్యూ.. చిరంజీవి సినిమా రికార్డులు ఖాయమట..syeraa
2019-10-01 21:46:10

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి హవా నడుస్తోంది. అన్ని ఇండస్ట్రీలలో చిరంజీవి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా మరికొన్ని గంటల్లో సైరా సినిమా విడుదలవుతుంది. ఇది ఎలా ఉండబోతుందని మెగా అభిమానులు కూడా కంటిమీద కునుకు లేకుండా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం ఒక అద్భుతమైన తీపికబురు చెప్పాడు బాలీవుడ్ క్రిటిక్. సైరా నరసింహారెడ్డి సినిమా అద్భుతంగా ఉందని.. ఈ చిత్రం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయంగా మిగిలిపోతుందని బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడు శివ సత్యం ట్వీట్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ ఒకే ముక్కలో సైరా నరసింహారెడ్డి సినిమా గురించి తేల్చేశాడు ఈయన. చిరంజీవి నటన.. నయనతార, తమన్నా స్క్రీన్ అప్పియరెన్స్.. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ.. ఫస్ట్ హాఫ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ.. సెకండ్ హాఫ్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు.. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్.. ఇవన్నీ ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయని చెప్పాడు శివ సత్యం. కచ్చితంగా సైరా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు ఇతర భాషా ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని ఆయన నమ్మకంగా చెప్పాడు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా తమ పని తాము సక్రమంగా చేశారని.. ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ ఆయన రివ్యూ ఇచ్చాడు. ఇది చూసిన తర్వాత సినిమాపై అంచనాలను మరింతగా పెరిగిపోయాయి. మరి నిజంగానే సైరా అలా ఉంటే మెగాస్టార్ చరిత్ర తిరగరాసినట్లే

More Related Stories