లూసిఫర్ రీమేక్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్Chiranjeevi
2021-01-19 15:08:12

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరు మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పలువురు దర్శకులను అనుకుని చివరికి ఈ ప్రాజెక్టు ను తమిళ దర్శకుడు మోహన్ రాజా చేతిలో పెట్టారు. మోహన్ రాజా సినిమా కథలో తెలుగు ఆడియన్స్ కు నచ్చేలా మార్పులు చేసి స్క్రీట్ రెడీగా పెట్టుకున్నారు. అంతే కాకుండా సినిమాలో నటీనటులను, టెక్నీషియన్ లను కూడా ఇప్పటికే ఖరారు చేసారు. లూసిఫర్ లో హీరోయిన్ ఉండదు. కానీ రీమేక్ లో హీరోయిన్ గా నయనతార ను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను జనవరి 21 న పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టనున్నారు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

More Related Stories