వారి కోసం ఫండ్స్ కలెక్ట్ చేసే యోచనలో చిరంజీవి chiranjeevi
2020-03-24 14:32:41

అనుకుకుంటున్నట్టే తెలుగు సినిమా రంగంలో చిరంజీవి పెద్దమనిషి హోదా కోసం యత్నాలు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. రాజకీయాల్లో ఎంటర్ అయి ఇబ్బంది పడిన ఆయన సినిమాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి రెండు సినిమాలు చేశారు. రెండు సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. మూడో సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అంటే టైటిల్ తో చేస్తున్నారు. ఇప్పుడు  ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల షూటింగులు అన్ని బంద్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఎవరింటికి వారు పరిమితమయ్యారు. ఈ వైరస్ దెబ్బకు దాదాపు దేశంలో ఉన్న అన్ని మూత పడ్డాయి. కేవలం అత్యవసర సర్వీసుల వారే బయటకు వస్తున్నారు. 

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో మార్చి 31 వరకు దేశం అంతా షట్ డౌన్ అయింది. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కయిన దాసరి నారాయణరావు చనిపోయిన తరువాత ఒకరకంగా చిరంజీవి పెద్దరికం చూపిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఇండస్ట్రీలో ఉపాధిలేక కోల్పోయిన వాళ్లకి కొంత మేర ఊరట కల్పించడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజశేఖర్ లాంటి వాళ్ళు కొంతమంది తమ పరిధిలో తాము సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్న చిరంజీవు టాలీవుడ్ కార్మికులకు ఇండస్ట్రీ ప్రముఖుల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. వీలయినంత త్వరగా ఈరోజు రేపటిలో ఆ నిధులు కలెక్ట్ చేసి కార్మికులకి నిత్యావసరాలు కొని పంచె ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. 

More Related Stories