YCPలోకి చిరంజీవి.. మెగాస్టార్‌ను ఆహ్వానిస్తున్న జగన్..  Chiranjeevi
2019-10-14 10:08:13

ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడు మళ్లీ అటు వైపు అడుగేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అందులోనూ అధికార పార్టీలో ఆయన అడుగు పెట్టబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ తో ఆయన మీటింగ్ కేవలం సినిమా కోసమే అని.. ఎలాంటి రాజకీయాలు ఉండబోవని ఇప్పటికే బొత్స కన్ఫర్మ్ చేసారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి వైసీపీలోకి వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. ఈయనకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసారని ప్రచారం జరుగుతుంది. ఇంకా చిరు వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ జగన్ మాత్రం ఎలాగైనా తన పార్టీలోకి మెగాస్టార్ ను తీసుకోవాలని చూస్తున్నాడు. ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. అందుకే చిరు మీటింగ్ కోసం అడిగిన వెంటనే జగన్ కూడా నో అనకుండా అప్పాయింట్మెంట్ ఇచ్చేసాడు. కచ్చితంగా ఈ మీటింగ్ రాజకీయ కోణంలోనే జరగబోతుందని తెలుస్తుంది. ట్యాక్స్ మినహాయింపు కోసం చిరు కలుస్తున్నాడని ప్రచారం జరిగినా కూడా కనీసం చిరుకు అలాంటి ఆలోచన కూడా లేదని తెలుస్తుంది. మొత్తానికి ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో చేరి మూడేళ్ల పాటు ఉన్న చిరు.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్తాడా అనేది చూడాలిక. 

More Related Stories