టికెట్ ధరల నియంత్రణ పై చిరు బృందం జగన్ ను కలుస్తుందా



Chiranjeevi
2021-04-15 14:03:43

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పై నియంత్రణ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సర్కారు పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ ను దెబ్బ కొట్టడానికే టికెట్ ధరల విషయంలో నియంత్రణ తీసుకువచ్చిందని జనసైనికులు.. ప్రతి పక్షాల వాదన. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ల ధరలు పెంచితే సామాన్యులు ఇబ్బందులు ఎదురుకుంటారని చెబుతోంది. అయితే ఈ విషయం పై సినీ పెద్దలు ఇప్పటివరకు స్పందించలేదు. 

నిజానికి దాసరి తరవాత ఇండస్ట్రీ లో ఏ సమస్య గురించి అయినా రాజకీయ నాయకులతో చర్చించడానికి చిరంజీవి వెళుతున్నారు. ఇప్పటికే నాగ్ మరియు మెగాస్టార్ కలిసి కేసీఆర్ ను పలుమార్లు కలిశారు. అంతే కాకుండా చిరు అమరావతి వెళ్లి గతంలో జగన్ ను కలిశారు. రెండు రాష్ట్రాల సీఎం లతోను మెగాస్టార్ కు సత్సంబంధాలు ఉన్నాయి కూడా. అయితే ఇప్పుడు కూడా చిరు బృందం తో కలిసి జగన్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసలే విడుదలకు ఎన్నో పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకోవాలని పరిశ్రమలోని పలువురు మెగాస్టార్ కు చెప్పారట. దాంతో త్వరలోనే జగన్ వద్దకు వెళుతున్నారని తెలుస్తోంది.

More Related Stories