చిరంజీవి చేసిన పనికి తలపట్టుకుంటున్న కొరటాలchiru
2020-03-12 03:04:53

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా టైటిల్ చెప్పేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఏంటి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొరటాల కూడా సస్పెన్స్ అలానే మెయింటైన్ చేశాడు. అయితే చిరంజీవి మాత్రం సైలెంట్ గా ఆచార్య అంటూ నోరు జారాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమా ఆచార్య.. అంటూ చెప్పి నాలిక కరుచుకున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత టైటిల్ చెప్పేసానా అంటూ పక్కనే ఉన్న బ్రహ్మాజీ వైపు చూశాడు.ఆ తర్వాత కొరటాల శివకు సారీ చెప్పాడనుకోండి అది వేరే విషయం. అయితే ఎంత సారీ చెప్పిన కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన సినిమాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే కొరటాల శివ ఇలా టైటిల్ లీక్ అవ్వడం పట్ల కాస్త ఇబ్బంది గానే ఉన్నాడట. ఇప్పటికే గోవింద ఆచార్య అనే టైటిల్ అనుకుని కట్ చేసి దానిని ఆచార్య ఫిక్స్ చేసారట. ఇప్పుడు అది కూడా బయటకు రావడంతో ఈ సినిమాకి తగ్గ టైటిల్ కోసం వెతుకుతున్నట్టు చెబుతున్నారు. 

More Related Stories