అందరూ ముందుకు రావాలి.. టాలీవుడ్‌కు చిరు పిలుపు..chiru
2020-04-01 14:27:30

కరోనా క్రైసిస్ ఛారిటీ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీనికోసం ప్రత్యేకంగా వీడియో సాంగ్ కూడా చేసాడు ఈయన. చిరుతో పాటు నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో ఉన్నారు. ఇదిలా ఉంటే కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఇంకా నిధులు కావాలంటున్నాడు మెగాస్టార్. ఎప్పటికప్పుడు ఇందులో ఎన్ని నిధులున్నాయనేది ప్రజలకు కూడా తెలిసేలా ట్వీట్స్ చేస్తున్నాడు. రెండు రోజుల కింద ఇందులో 3 కోట్లకు పైగానే పోగయ్యాయని ట్వీట్ చేసాడు. ఇప్పుడు మరో 3 కోట్ల వరకు వచ్చాయి. అంటే మొత్తం 6.3 కోట్లు ఇప్పటి వరకు వచ్చాయని.. ఇంకా రావాలని కోరుతున్నాడు చిరంజీవి. దయచేసి ఈ సమయంలో అంతా ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేయాలని చిరు కోరుతున్నాడు. తన తోటి నటీనటులనే కాకుండా హీరోయిన్లను, మిగిలిన టెక్నీషియన్లను కూడా ఈ కష్టకాలంలో కచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గుర్తు చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే దాదాపు అందరూ విరాళం అందించారు. శ్రీకాంత్ కూడా 5 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు, బాలయ్య, రాఘవేంద్రరావు లాంటి పెద్ద వాళ్లు మాత్రం ఇంకా స్పందించలేదు. విజయ్ దేవరకొండ కూడా ఇప్పటి వరకు విరాళం మాట అయితే ఎత్తలేదు. మరి వాళ్లంతా ఎప్పుడిస్తారో తెలియదు. చిరు ఓ రకంగా అడుగుతున్నది కూడా వాళ్లనే కావచ్చు. మొత్తానికి చూడాలిక.. సినిమా కార్మికుల కోసం మన హీరోలు ఇంకా ఎంతమంది ముందుకొస్తారో..?

More Related Stories