చిరంజీవి, వెంకటేష్ ఓటిటి ఎంట్రీ.. ఇంకేమైనా ఉందా..?chiru
2020-05-11 19:20:52

తెలుగు ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త యాప్ లు వచ్చేసరికి ఓటిటి కూడా బాగా డెవలప్ అవుతుంది. అందులో ముఖ్యంగా తెలుగులో అల్లు అరవింద్ ఆహా యాప్ కూడా బాగానే దూసుకుపోతుంది. అక్కడ వరసగా షోలు ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత అరవింద్. ఇదిలా ఉంటే ఇప్పుడు లాక్‌డౌన్‌ కాలంలో డిజిటల్‌ వరల్డ్ సంచలనాలు రేపుతుంది. వరసగా అక్కడ విడుదలవుతున్న వెబ్ సిరీస్ లు కూడా రచ్చ చేస్తున్నాయి. దాంతో సీరియల్స్ మరిచిపోయి అటువైపు అడుగేస్తున్నారు ప్రేక్షకులు కూడా. ఇప్పుడు ఈ క్రేజ్ వాడుకోడానికి స్టార్ హీరోలు కూడా సై అంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఓటిటి వైపు వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు చూసి మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే తమ బావ అల్లు అరవింద్ ఆహా యాప్ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆహా వేదికగా వెబ్‌ సిరీస్ రూపంలో మెగాస్టార్‌ తన హవాను ఓటీటీలో కూడా చూపబోతున్నారని తెలుస్తుంది. మరోవైపు తేజ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ కోసం సురేష్ బాబు కూడా ఓటీటీ సిరీస్‌ను రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి వాళ్లు ఓటిటిలోకి వచ్చారు. ఇప్పుడు సీనియర్ హీరోలు కూడా వస్తే రచ్చ రచ్చే.

More Related Stories