ఆ ఛానెల్ కి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..  Chiranjeevi
2019-09-27 13:37:34

తెలుగులో మీడియా ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ విషయంలోనూ సినిమా వాళ్లకు కూడా ధీటుగా ముందుకెళ్తుంది మన మీడియా. అందులో కొన్ని సంస్థలైతే కావాలనే కొందరు సినిమా వాళ్లను టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. తన సైరా సినిమాను కావాలనే టార్గెట్ చేసుకుని నెగిటివ్ స్టోరీలు ప్రసారం చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానెల్ పై చిరంజీవి నోటి దరుసు చూపించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ఛానెల్ CEOకు ఫోన్ చేసి మరీ మీరు ఇంక మారరు.. గతంలోనూ ఇలాగే చేసారు.. యాజమాన్యం మారిన తర్వాత కూడా మీ బుద్ధులు ఇంకా మారలేదు.. జీవితంలో మీరు మారరు అంటూ చిరు క్లాస్ పీకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హక్కుల కోసం బాగానే పోటీ చేసిన ఆ ఛానెల్ కు చివర్లో నిరాశే ఎదురైంది. సాక్షి టీవీకి ఈ హక్కులు వెళ్లాయి. దాంతో అది మనసులో పెట్టుకుని సైరాపై వాళ్లు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. కావాలనే ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను కూడా రెచ్చగొట్టి వివాదం పెద్దది చేస్తున్నారని చిరంజీవికి ఎవరో చెప్పడంతో ఆయన సీరియస్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయితే మాత్రం కచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఛానెల్ కు చిరు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. మరి దీనిపై ఆ ఛానెల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో..?

More Related Stories