కుర్ర దర్శకుడితో చిరంజీవి సినిమా Chiranjeevi
2021-02-09 00:05:48

జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో స్టార్ హీరోలను తాను బాగానే హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న బాబీ.. చిరంజీవి కోసం కథను రెడీ చేసాడు. ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. తన 154వ చిత్రాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. ఉప్పెన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లూసిఫర్‌ తరువాత బాబీతో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. మెగాస్టార్ మార్క్ ఫుల్ మాస్ క్యారక్టర్ లో కనిపిస్తారని తెలుస్తుంది.

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత సైరా సినిమాతో సత్తా చాటారు. కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఈ సినిమా తర్వాత ఎవరి సినిమా ముందు మొదలుపెడతాడో చూడాలి. బాబీతో సినిమాపై మెగా ఫ్యాన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. రైటర్ బాబీ కి ఫ్రీడమ్ ఇవ్వాలే కానీ అదిరిపోయే సినిమా చేస్తాడని అంటున్నారు.మెగాస్టార్ కోసం బాబీ ఎలాంటి కథ రాశాడో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది.

More Related Stories