హీరోగా ఎంట్రీ ఇస్తున్న జానీమాస్టర్.. నేడే ముహూర్తంChoreographer Jani
2020-12-28 11:49:00

మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు స్పందించని జానీ మాస్టర్ నేరుగా ఈరోజు షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. సుజీ విజువల్స్ బ్యానర్ పై కె.వెంకట్ రామణ నిర్మాతగా మురళీ రాజ్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు (డిసెంబర్ 28) న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నేడు చిత్రయూనిట్ వెల్లడిస్తుంది. 

ఇప్పటివరకు డ్యాన్సులతో అదరగొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్ ఎలా చేస్తారో చూడాలి మరి. ఇక ఈ విషయం పక్కన పెడితే జానీ మాస్టర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ ను జానీ డైరెక్ట్ చేయబోతున్నారని ఈ సినిమాకు బండ్లగణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తానే హీరోగా ఎంట్రీ ఇస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. దాంతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

More Related Stories