బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ మళ్లీ మొదలైందాravi
2019-10-11 19:52:04

బాలకృష్ణ, రవితేజ మధ్య సద్దుమణిగిపోయిందనుకున్న గొడవ మళ్లీ మొదలైంది. అసలు విషయం ఏమిటో బైటకిరాకపోయినా ఈ ఇద్దరి మధ్య వివాదం నడిచిందన్నది ఫిలింనగర్‌ టాక్‌. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం ఓ గొడ‌వ జ‌రిగింద‌న్న రూమ‌ర్ అయితే బ‌లంగా ఉంది. ఈ ఇద్దరితోను ఒకే టైంలో జోడీ క‌ట్టిన ఓ హీరోయిన్ విష‌యంలో ఏర్పడిన బేధాభిప్రాయాలు చాలా తీవ్రరూపం దాల్చిన‌ట్టు అప్పట్లో టాక్‌. ఆ త‌ర్వాత వీరిద్దరి మ‌ధ్య గ్యాప్ మాత్రం అలాగే ఉంద‌ని వినిపించే రూమ‌ర్‌. బాల‌య్య సినిమాల‌పై ర‌వితేజ కావాల‌నే త‌న సినిమాల‌ను పోటీకి దింపుతాడ‌న్న ప్రచారం కూడా ఉంది.

గ‌తంలో రెండు సార్లు సంక్రాంతికి వీరిద్దరు పోటీ ప‌డ్డారు. 2005లో భద్ర సినిమా తో మహారధి, 2008లో బాల‌య్య సంక్రాంతికి ఒక్క మగాడు సినిమాతో వ‌స్తే, ర‌వితేజ కృష్ణగా వ‌చ్చాడు. ఈ రెండు సినిమాల పోటీలో కృష్ణ హిట్ అవ్వగా ఒక్కమ‌గాడు డిజాస్టర్ అయ్యి ర‌వితేజ‌దే పైచేయి అయ్యింది. ఆ తర్వాత 2011 సంక్రాంతికి బాలకృష్ణ 'పరమవీరచక్ర' రవితేజ 'మిరపకాయ్' సినిమాలు ఒకేరోజు విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. అయితే విజయం రవితేజనే వరించింది. ఈ కాంట్రవర్సీ సమసిపోయిందనుకుంటే మళ్లీ మొదటికి వచ్చింది.    ఒకేరోజు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి దిగారు.

బాలకృష్ణ - రవితేజ సినిమాలు డిసెంబర్ 20న బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కానున్నట్లు తెలుస్తోంది. సి కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. మాస్ రాజా సైన్స్ ఫిక్షన్ సినిమా డిస్కో రాజా కూడా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. ముందు నుంచి సినిమానుక్రిస్మస్ కి విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ బాలయ్య మధ్య ఫైట్ తప్పేలా లేదనిపిస్తోంది. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.

More Related Stories