సీఎం బాలయ్య...నిజమేనా....Balakrishna Rullor.jpg
2019-10-30 09:00:19

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరకెక్కిస్తుండగా సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జై సింహా సినిమా హిట్ గా నిలవడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న బాలయ్య గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడన్నేదే ఈ సినిమా లైన్. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య   బోయపాటి తో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 

వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూడో సినిమా అంత కన్నా పెద్ద హిట్ అయ్యే విధంగా పని చేస్తోంది బొయపాటి యూనిట్. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బోయపాటి టీమ్ మాత్రం అదేం లేదని ఆఫ్ ది రికార్డ్ చెబుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశాలున్నాయట. ఒక హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ను దర్శకుడు బోయపాటి పరిశీలిస్తున్నారని త్వరలోనే ఆ ఇద్దరినీ ఫైనలైజ్ చేస్తారని చెబుతున్నారు.

More Related Stories