వైసీపీలో రోజాకు మరో పదవి ఇవ్వబోతున్న సీఎం జగన్..CM YS Jagan
2020-06-04 02:40:44

పదేళ్లక్రితం రోజాను ఐరన్ లెగ్ అనే వాళ్ళు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుందని ప్రచారం చేశారు. ఆమె దురదృష్టమో ఏమో కాని నిజంగానే కొన్నిసార్లు పార్టీలు కూడా ఓడిపోయాయి. అయితే రాజకీయాల్లో ఎన్ని విమర్శలు తీసుకుంటే అంత గట్టి పడతారు అనడానికి రోజానే నిదర్శనం. గెలిచిన ఓడిన తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉంటాను అంటూ అతనితో చేరిన రోజా 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇక మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో గెలవడంతో కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు రోజా. 

ఆమె స్వామి భక్తికి మెచ్చిన జగన్ మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు. ఏపీలో ఏ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా అందులో రోజా అనుమతి కూడా కావాల్సిందే. అంత మంచి పదవి ఇచ్చాడు జగన్. ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు మరో పదవి కూడా ఇచ్చే ఉద్దేశంలో కనిపిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ రంగం నుంచి వచ్చిన రోజాను ఈ కమిటీ చీఫ్‌గా నియమించబోతున్నట్టు తెలుస్తుంది. ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. 

ఎవరైనా టాలీవుడ్ దర్శక నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటికి విన్నవిస్తే సరిపోతుంది. ఆ తర్వాత రోజా తన కింద ఉన్న ఐఏఎస్ అధికారి ద్వారా షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేలా చేస్తోంది. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ సినిమా షూటింగ్స్ బాధ్యతలు రోజా చేతుల్లో పెట్టడం నిజంగానే మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు. 

More Related Stories