కార్తికేయ 2లో కలర్స్ స్వాతి కూడా  Colors Swathi
2020-04-21 11:59:05

అప్పుడెప్పుడో నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' మంచి హిట్ గా నిలిచింది. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు గత ఏడాది మేలోనే ప్రకటించారు. 

ఈ సినిమా షూటింగ్ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని భావించినా అది ఎందుకో గానీ లేటయింది. ఇక మార్చి నెల మొదటిలో తిరుమలలో ఈ సినిమా ఓపెనింగ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా మీద కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ పడి ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకో ప్రచారం కూడా జరిగింది.  

'కార్తికేయ'లో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. 'కార్తికేయ 2'లోనూ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కలర్స్ స్వాతి 'కార్తికేయ 2'లో నటించడం నిజమే నని కానీ అది గెస్ట్ రోల్ లో మాత్రమేనని అంటున్నారు. ఇందులో ఆమె హీరోకి మాజీ ప్రేయసిగా నటించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాని  తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

More Related Stories