కమెడియన్ సునీల్ కు నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసాడా..



 balakrishna
2020-09-19 16:15:29

సునీల్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన లేని సినిమా వచ్చేది కాదు. సునీల్ తమ సినిమాలో ఉంటే కామెడీకి ఢోకా లేదు అని దర్శక నిర్మాతలు కూడా నమ్మేవాళ్ళు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు అయితే సునీల్ లోని కమెడియన్ ని ఓ రేంజ్ లో వాడుకున్నారు. ఆ తర్వాత హీరో అయిపోవడంతో ఆయన కామెడీని ప్రేక్షకులు కూడా చాలా మిస్ అయ్యారు. అయితే ఇప్పటికీ సునీల్  తమ సినిమాలో ఉంటే బాగుంటుంది అని కోరుకునే హీరోలు  తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు. ఒకప్పుడు ఈయన సినిమాల్లో సునీల్ మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు. మరీ ముఖ్యంగా లక్ష్మీ నరసింహ సినిమాలో సునీల్ కామెడీ ట్రాక్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఆ తర్వాత కూడా బాలయ్యతో కలిసి నటించాడు. ఇప్పుడు మళ్ళీ కామెడీ రోల్స్ చేస్తుండటంతో తన సినిమాలో ఒక పాత్ర కోసం ప్రత్యేకంగా బాలయ్య.. సునీల్ కు ఫోన్ చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి విషయాల్లో బాలకృష్ణకు అసలు భేషజాలు ఉండవు. సినిమాకు హెల్ప్ అవుతాడు అనుకుంటే ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో సునీల్ కు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పూర్తి స్థాయి కామెడీ ప్రధానంగా సాగే పాత్ర సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుందని బోయపాటి నమ్ముతున్నాడు. గతంలో ఆయన తెరకెక్కించిన భద్ర సినిమాలో సునీల్ అద్భుతమైన కామెడీ చేశాడు. అదే నమ్మకంతో ఇప్పుడు తనకు సునీల్ కావాలని బాలయ్యను అడిగినట్లు తెలుస్తోంది. అందుకే బాలకృష్ణ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని సునీల్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని కుదిరి బాలయ్య సినిమాలో సునీల్ మంచి కామెడీ చేస్తే మిగిలిన దర్శక నిర్మాతలకు కూడా అది హెల్ప్ అవుతుంది. 

More Related Stories