వేణు మాధవ్ తొలి రోజుల్లో.. ఎన్టీఆర్‌తో అనుబంధం ఎలాగంటే..venu
2019-09-26 07:16:29

కమెడియన్ వేణు మాధవ్ మరణం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. కొన్నేళ్లుగా ఈయన సినిమాల్లో కనిపించడం మానేసాడు కానీ ప్రేక్షకులకు మాత్రం దూరం కాలేదు. ఆయన లేకపోయినా కూడా ఆయన కామెడీ సీన్స్ మాత్రం ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈయన పుట్టింది పెరిగింది అంతా నల్గొండ జిల్లా కోదాడలోనే. 4వ ఏట నుంచి మిమిక్రీ చేయడం మొదలు పెట్టాడు వేణు. అక్కడే చదువు కూడా పూర్తి చేసాడు. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా హీరోలను అనుకరిస్తూ.. వాళ్లను అచ్చంగా దించేస్తూ అందర్నీ అలరించేవాడు వేణు మాధవ్. దాంతో పాటు డాన్సులు.. ఓ చేతిలో బొమ్మ పట్టుకుని వెంట్రిలాక్విజం కూడా చేసాడు. అన్నీ చేస్తూనే కళారంగం వైపు వచ్చాడు వేణు మాధవ్. ఆ కళతోనే సీనియర్ ఎన్టీఆర్‌తోనూ మంచి అనుబంధం ఏర్పడింది ఈయనకు. అలా హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఉద్యోగం సంపాదించాడు వేణు మాధవ్. ఎన్టీఆర్ చెప్పడంతోనే కోదాడ నుంచి హైదరాబాద్ బస్సెక్కాడు వేణు. ఇక్కడే ఉంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. అలా ఓ సారి రవీంద్ర భారతిలో చేసిన మిమిక్రీ చేస్తుంటే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈయన్ని చూసి తన సినిమా సంప్రదాయంలో చిన్న వేషం ఇచ్చాడు. అది కాస్తా మంచి సక్సెస్ కావడంతో వేణు బిజీ అయిపోయాడు. పవన్ కల్యాణ్ గోకులంలో సీత.. చిరంజీవి మాస్టర్.. సుస్వాగతం.. తొలిప్రేమ లాంటి సినిమాల్లో కనిపించాడు.. స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి తొలి రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు వేణు మాధవ్.

More Related Stories