టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూత..VenuMadhav Dead.jpg
2019-09-25 12:49:29

ఒకప్పుడు కమెడియన్లు తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉండే వాళ్ళు. మిగిలిన ఇండస్ట్రీలు కూడా టాలీవుడ్ ని చూసి కుళ్లుకునేవాళ్లు. . ఎలాంటి ఇగోల్లేకుండా ఒక్కో సినిమాలో డ‌జ‌న్ పైగా క‌మెడియ‌న్లు క‌లిసి న‌టించే ఇండ‌స్ట్రీ తెలుగు సినిమా మాత్ర‌మే. అందుకే ఇప్పుడు ఎవరిదో దిష్టి మన ఇండస్ట్రీకి తగిలినట్లుంది. అందుకే ఒక్కొక్కరుగా తెలుగు ఇండస్ట్రీ కమెడియన్లు మనకు దూరం అవుతున్నారు. అప్పుడెప్పుడో 11 ఏళ్ళ కింద మల్లికార్జునరావుతో మొదలైన ఈ విషాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వరసగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోతున్న ఈ కమెడియన్లను చూసి కళామతల్లి మౌనంగా రోదిస్తుంది. 

తాజాగా కమెడియన్ వేణు మాధవ్ తెలుగు ప్రేక్షకులకి దూరం అయ్యారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వేణు మాధవ్ పరిస్థితి విషమించడంతో ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి మీద ఇప్పుడు పరిస్థితి ఇంకా విషమించడంతో నిన్నటి నుండి డాక్టర్లు ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన రెండు కిడ్నీలు కూడా దెబ్బతినడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారి కన్నుమూశారు. విషయం తెలుసుకున్న టాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.  సూర్యపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా ఎదిగారు. 

1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. 2006లో వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకుెక్కిన ‘లక్ష్మి’ సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పిలుపునందుకుని మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్న ఆయన నటుడిగా మారాడు.

More Related Stories