కరోనాతో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూతPandu
2021-05-06 13:10:35

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు పాండు(74) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పాండు.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. పాండుకి భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. పాండు భార్య కుముధకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాదల్ కొట్టై, పనక్కరన్, దైవ నాకు, రాజది రాజ, నాట్టమై, ఉల్లతై అల్లితా, వాలి, ఎన్నవాలే అండ్ సిటిజన్, తదితర సినిమాల్లో ఆయన నటించారు. రాజకీయాల్లో కూడా ఆయన తన సత్తా చాటుకున్నారు. 

More Related Stories