మా లో మళ్లీ మొదలైన ముసలం.. తారాస్థాయికి చేరిన సమరం..maa
2019-10-20 17:32:35

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ లో ఎప్పుడు ఎలాంటి అల్లర్లు జరుగుతాయో.. ఎప్పుడు ఎవరిపై మాటల తూటాలు పేల్చుకుంటారో అర్థం కాదు. వాళ్ళలో వాళ్ళు అంతా మా అనుకుంటారు.. కానీ లోలోపల మాత్రం మీరు మేము అంటూ సిగపట్లు పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్ళీ రచ్చ మొదలైంది. కొత్త అధ్యక్షుడు నరేష్ వచ్చిన తర్వాత చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆయన పనితీరుపై సభ్యులు కూడా అసంతృప్తితో ఉండటంతో ఇది మరింత పెరిగిపోతుంది. తాజాగా మా అసోసియేషన్ మీటింగ్ తర్వాత ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చేశారు. మా అధ్యక్షుడు నరేష్‌ పనితీరుపై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మా తీరుపై 30 ఇయర్స్ పృథ్విరాజ్‌ తీవ్ర విమర్శలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మా అధ్యక్షుడు నరేష్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని ప్రచారం జరుగుతుంది. తనకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యత్వం కూడా అక్కర్లేదని పృథ్విరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నరేష్‌తో సంబంధం లేకుండా ఆయనతో అవసరం లేకుండా ఒక సాధారణ మీటింగ్ ఉంటుందని మా సభ్యులకు జీవిత ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది. అది చూసి అక్కడికి వచ్చిన వాళ్లకు.. వచ్చిన తర్వాత ఒక షాక్ తగిలింది. సాధారణ మీటింగ్‌ అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత అది సర్వసభ్య సమావేశమని చెప్పడంపై కొందరు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. సమావేశం నుంచి సభ్యులు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

More Related Stories