నాగ‌చైత‌న్య సినిమాకి క‌రోనా ఎఫెక్ట్



Naga Chaitanya
2021-05-01 16:13:18

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం థాంక్యూ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మ‌నం సినిమా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాలో చైతూ స‌ర‌స‌న హీరోయిన్ గా రాశీక‌న్నా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను ర‌ద్దు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండ చిత్ర యూనిట్ ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతున్న‌ట్టు స‌మాచారం.

 ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్స్ తో దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. ఆచార్య‌, ఆర్ఆర్ఆర్, పుష్ప తో పాటు మ‌రిన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. అంతే కాకుండా విడ‌ద‌ల‌కు సిద్దంగా ఉన్న సినిమాలు కూడా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే నాగచైత‌న్య హీరోగా న‌టిస్తున్న థాంక్యూ సినిమా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ ను ష‌ర‌వేగంగా జ‌రుపుకుంది. క‌రోనా టైం లోనూ ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకోవడానికి కార‌ణం ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఇట‌లీ లో జ‌రగ‌డ‌మే. 

అయితే మ‌న‌ద‌గ్గ‌రంటే క‌రోనా ఉంది కానీ అక్క‌డ ప‌రిస్థితులు సాధార‌ణంగానే ఉన్నాయి. కానీ ప్ర‌స్తుతం క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ఇత‌ర దేశాలు భార‌త్ నుండి రాక‌పోక‌లు నిలిపివేశాయ‌ట‌. కాగా షెడ్యూల్ లో భాగంగా ఇప్పుడు ప్ర‌కాశ్ రాజ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ ఆయ‌న ఇండియాలో ఉన్నారు. మ‌రి కొందరు న‌టీన‌టులు కూడా ఇండియాలోనే ఉన్నారు. దాంతో చేసేదిలేక సినిమా షూటింగ్ ను ర‌ద్దు చేసుకుని ఇండియాకు వ‌చ్చేస్తున్నార‌ట‌. 

More Related Stories