ట్రంప్ నోట పవన్ కళ్యాణ్ డైలాగ్...పవన్ మీద ట్రోలింగ్

అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నా అంటాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు అదే డైలాగ్ ను అమెరికా అధ్యక్ష్యుడు ట్రంప్ వాడుతున్నాడు. అదేమిటి పవన్ డైలాగ్ ట్రంప్ వాడుతున్నాడు అనుకుంటున్నారా ? ఒక రకంగా కరోనా వైరస్ చరిత్రను తిరగరాస్తోంది. అన్నింటా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా సైతం కరోనా ధాటికి చివురుటాకులా వణుకుతోంది. కరోనా భయంతో అమెరికా సుప్రీం కోర్టును షట్‌డౌన్ చేశారు. సుప్రీం కోర్టు తలుపులు మూసేయడం వందేళ్ల తరువాత ఇదే తొలిసారి.
కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్నందున్న విధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా సుప్రీం కోర్టు తెలిపింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో అమెరికా దాదాపుగా 'షట్‌డౌన్' అవుతోంది. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు, మేయర్ల ఆదేశాలతో సినిమా థియేటర్లు, ఇతర వినోద వేదికలు, బార్లు, నైట్‌క్లబ్‌లు మూతపడుతున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు విదేశీ పర్యటనలకు వెళ్లిన అమెరికన్లు హడావుడిగా తిరుగుముఖం పడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 50 శాతం విమానాలను తగ్గిస్తామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
కొవిడ్-19ను కట్టడి చేయాలంటే 14 రోజులపాటు షట్‌డౌన్ అవసరమని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామంటూ కరోనాపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా కరోనాపై విజయం సాధిస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో కరోనా కేసులు ఏడు వేలకు చేరువవడంతో అత్యవసర పరిస్థితులు కనిపిస్తున్నాయి. 50 రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 109 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇక పవన్ కరోనా మీద స్పందించక పోవడం మీద కూడా నెటిజన్లు కొందరు ప్రశ్నిస్తున్నారు. జనం కోసం జనసేన అని చెప్పుకునే జనసేన ఎన్నికల గురిన్కిహ్ స్పందించాడు కానీ కరోనా గురించి ఎప్పుడూ స్పందించలేదని ఆయన మీద కామెంట్ చేస్తున్నారు కొందరు.