రజనీకాంత్ సినిమానీ వదలని కరోనాRajanikanth.jpg
2020-03-08 07:21:00

జీవితం ఎవరినీ వదలదు అందరి సరదా తీర్చేస్తది అని టెంపర్ లో ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంటది. ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి అలానే తయారయ్యింది. కానీ జీవితం ప్లేస్ లో కరోనా పెట్టాలి. అవును ప్రపంచం మొత్తాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ సినిమానే రిలీజ్ వాయిదా వేసుకుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రజనీ సినిమా మీద కూడా పడింది. రజినీకాంత్ అన్నాత్తే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.  హైదరాబాద్ షెడ్యూల్ తరువాత ఈ సినిమా కోల్ కతా, పూణేలో షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ షెడ్యూల్ ను మారుస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే, మళ్ళీ హైదరాబాద్ లోనే షెడ్యూల్ స్టార్ట్ చేయాలని యూనిట్ నిర్ణయించినట్టు చెబుతున్నారు.  కుష్బూ, మీనా, కీర్తి సురేష్ లు నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

More Related Stories