కరోనా వైరస్ పై బాలీవుడ్ యుద్ధం.. Corona virus effect
2020-03-21 19:04:13

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుంది. దాంతో దాన్ని అరికట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి బాధ్యత తీసుకుంది. ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు బయటికి వచ్చి కరోనా వైరస్ గురించి జనానికి అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బయటికి వచ్చారు. వాళ్లకు తోడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా ఒక వీడియో విడుదల చేశాడు. ప్రజలను ఈ వైరస్  నుంచి ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలు సూచించాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనతో పాటు ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, అజయ్ దేవగన్, రన్వీర్ సింగ్, వరుణ్ ధావన్, ఆలియా భట్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి తరఫున ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

More Related Stories