భార్యకు వండిపెడుతున్న రామ్ చరణ్.. Ram charan
2020-04-16 17:22:36

లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఇంట్లో సెలబ్రిటిస్ కూడా అంతా వంట వాళ్లైపోతున్నారు. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్లైనా కూడా గరిట పడుతున్నారు. పని వాళ్లు లేరు కాబట్టి తమ పనులు తామే చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసన కోసం డిన్నర్ తయారు చేసాడు. ఇదే విషయం ఉపాసన కూడా ట్వీట్ చేసింది. భర్తలంతా దీన్ని ఒక్కసారి గమనించాలి.. నా కోసం వంట చేయడమే కాకుండా చేసిన గిన్నెలను కూడా అతడే తోమాడు.. అందుకే అతను నా దృష్టిలో హీరో అయ్యాడు అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భార్య కోసం గరిట పట్టుకున్న చరణ్ ను చూసి కత్తితో పాటు గరిట కూడా బాగానే తిప్పుతున్నారుగా అంటూ కొందరు అభిమానులు ఆట పట్టిస్తున్నారు కూడా. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్, తన భార్య ఉపాసనకు స్వయంగా వండి వడ్డించాడు. 

More Related Stories