రియా చక్రవర్తికి మరోసారి బెయిల్ తిరస్కరణ.. హై కోర్టులో అప్పీల్.. Rhea Chakraborty
2020-09-17 18:56:15

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఈయన మరణం నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేస్ వరకు చాలా విషయాల్లో ఈ కేసు ముందుకు వెళుతుంది. బాలీవుడ్లో మరో 25 మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు అంటూ రియా చక్రవర్తి విచారణలో బయట పడింది. దాంతో వాళ్లకు కూడా నోటీసులు పంపించడానికి సిద్ధమయ్యారు NCB. ఇదిలా ఉంటే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. ఈ రెండు కేసులు మధ్యగా చక్రవర్తి నలిగిపోతుంది అంటూ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. 

NCB అరెస్టు తర్వాత కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకుంది రియా చక్రవర్తి. కానీ ఈమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. డ్రగ్స్‌ కేసులో నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ అయిన ఈ నటికి ముంబయి కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని.. ఇలంటి సమయంలో బెయిల్ కానీ ఇస్తే కచ్చితంగా వాళ్లు సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు భావిస్తుంది. అందుకే ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం డ్రగ్స్‌ను సేకరించడాన్ని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా పేర్కొన్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ కేవలం 59 గ్రాములేనన్న ఆమె వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే తాము హై కోర్టుకు వెళ్తామని రియా తరఫు న్యాయవాది చెప్తున్నాడు.

More Related Stories