ధనుష్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చెన్నై కోర్ట్..Dhanush
2020-02-29 15:52:27

ధ‌నుష్‌పై ఆ మ‌ధ్య మ‌ద్రాస్ హై కోర్ట్‌లో ఓ సంచ‌ల‌న కేసు న‌మోదైంది. ఈ హీరో త‌మ కుమారుడు అంటూ మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథరేసన్, కె. మీనాక్షి దంప‌తులు ధనుష్ తమ కుమారుడే అంటూ కోర్టు మెట్లెక్కారు. మా ఇద్దరికీ ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అని అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు ఈ జంట‌. ఈ మేరకు వాళ్ల కోరిక‌ను మ‌న్నించి.. కోర్ట్ వాళ్ల పిటిష‌న్ ను స్వీక‌రించింది. 

మేలూరు కోర్టు జుడిషియల్ మెజిస్ట్రేట్ ధనుష్ కు నోటీసులు జారీ చేసారు. ఈ కేసు విచారణ ఇప్ప‌టికే చాలా సార్లు జ‌రిగింది. ఎన్నో హియ‌రింగ్ ల త‌ర్వాత చివ‌రికి ఈ కేసులో ధ‌నుష్ కు ఊర‌ట లభించింది. ధ‌నుష్ త‌మ కుమారుడే అని చెబుతోన్న వృద్ధ దంప‌తులు.. దానికి త‌గిన సాక్ష్యాలు చూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. దాంతో కేసు కొట్టేసింది. ధ‌నుష్ తమ పెద్ద కుమారుడని.. ఇత‌డితో పాటు తమకు ధనపాకియమ్ అనే కూతురు కూడా ఉందని క‌ద‌రేస‌న్ దంప‌తులు అప్ప‌ట్లో కోర్టుకు తెలిపారు. 

దీనికి సాక్ష్యంగా ధనుష్ బర్త్ సర్టిఫికెట్.. ఈ హీరోను పోలి ఉన్న చిన్న‌ప్ప‌టి ఫోటోల‌ను కూడా దంపతులు కోర్టుకు సమర్పించారు. తాను రిటైర్డ్ బస్ కండక్టర్ అని.. తన కుమారుడు 10వ తరగతి వరకు మేలూరులోని ఆర్ సి మిడిల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాలలో చ‌దువుకున్నాడ‌ని.. తర్వాత 2002లో అతన్ని ఇంట‌ర్ కోసం శివగంగ జిల్లా తిరుపథూర్ లోని అరుముగమ్ పిల్లై సతాయ్యామ్మాల్ హెచ్ఎస్ఎస్ లో చేర్పిస్తే.. నెలరోజుల్లోనే స్కూలు విడిచి పారిపోయాడని కథరేసన్ తన పిటీషన్లో పేర్కొన్నారు. 

ఆ త‌ర్వాత చెన్నై వెళ్లి క‌స్తూరి రాజా ఇంట్లో పెరిగాడ‌ని.. ఇప్పుడు త‌మ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని నెల‌కు 65 వేల రూపాయ‌లు వ‌చ్చేలా చూడ‌మ‌ని కోర్ట్ కు విన్నవించుకున్నారు ఈ దంప‌తులు. అయితే ఈ కేసు ఎన్నో మ‌లుపులు తిరిగిన త‌ర్వాత ఇప్పుడు ధనుష్‌కు షాకిచ్చింది కోర్ట్. బర్త్ సర్టిఫికేట్ తో పాటు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్ అన్నీ కోర్టుకు సబ్ మిట్ చేయాల్సిందిగా చెన్నై బెంచ్ కోర్ట్ తెలిపింది.

More Related Stories