బతుకుతామనే ఆశను కోల్పోయాం..హాట్ హీరోయిన్ ఎమోషనల్ Covid19 Hamsa Nandini
2021-06-08 12:17:56

ఈగ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ హంస నందిని. పొడవాటి కాళ్ళతో హంస లాగా ఉండే ఈ భామ అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టూ పార్టీ అంటూ పవన్ తో స్టెప్పులు వేసి ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చింది. అయితే హంస నందిని కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. దానికి కారణం ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడంలేదని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటోలు పెట్టుకుంటూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. కానీ గత నెల రోజులుగా హంసనందిని సోషల్ మీడియాకూడా దూరంగా ఉంది. అసలు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో హంస నందిని కరోనా బారినపడిందని అంతా అనుకున్నారు. కాగా తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన హంస ఆ విషయం పై క్లారిటీ ఇచ్చేసింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని...తన కుటుంబం మొత్తానికి కరోనా వచ్చిందని తెలిపింది. కుటుంబం మొత్తం నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే గడిపినట్టు వెల్లడించింది. హాస్పిటల్ లో ఉన్నప్పుడు బతుకుతామన్న ఆశను కూడా కోల్పోయామని చెప్పింది. కానీ దేవుడి దీవెన మీ అందరి ప్రార్థనల వల్లే బతికి భయటపడ్డామని పేర్కొంది.

More Related Stories