అర్జున్ రెడ్డి లవర్ మీద క్రిమినల్ కేసుShalini Pandey
2019-12-23 14:49:57

తెలుగు సినిమాల్లో అర్జున్ రెడ్డి సినిమా పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. ఆ సినిమాలో నటించిన అందరికీ మంచి అవకాశాలు వచ్చాయి కానీ నటి షాలిని పాండేకి కూడా అన్ని భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె మాత్రం చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో, తెలుగులో, హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌చేస్తోంది. అయితే షాలిని పాండే మీద క్రిమినల్ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. అదేంటి అంత క్రిమినల్ పని ఏమి చేసిందో అని అనుకోకండి. ఆమె నటిస్తానని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిందట. అయితే నటించకపోవడంతో ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ సినిమా మేకర్స్. 

అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో విజయ్ ఆంటోనీకి జోడీగా షాలిని ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని ఆ తర్వాత షూట్ కి రాలేదట. అయితే ఈ సినిమాకు నిర్మాత అయిన శివ ఎంత ట్రై చేసినా ఆమె షూట్ కి రాకపోవడంతో పారితోషికం తీసుకుని సినిమాలో నటించలేదని తెలుగు, తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో షాలినిపై క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమా వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు, విలక్షణ నటుడు కమల్ హాసన్ కు ఈ సినిమా వలనే నటి మీరా మిథున్ నెపోటిజం అంటగట్టింది. ఆమె 'అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించాల్సి ఉంది. అయితే సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకుని ఆ తర్వాత తొలగించేశారట. ఆమె ప్లేస్‌లో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ను ఎంపిక చేసుకున్నారట. ఈ మేరకు కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ మీరా ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. మీరా ఆరోపణలపై దర్శకుడు నవీన్ అప్పట్లో స్పందించారు. 'అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను ఎంపిక చేసుకున్నామని పేర్కొన్నారు.
 

More Related Stories