20న ‘భీమ్లా నాయక్’ నుంచి రానా ఫస్ట్ లుక్Daggubati rana as daniel shekar in bheemla-nayak
2021-09-18 22:48:58

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి రీమేక్. దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భీమ్లా నాయక్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.

పవర్ స్టార్ లుక్ బయటకు వచ్చిన తర్వాత రానా దగ్గుబాటి లుక్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు రానా లుక్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహుర్తం ఖరారు చేశారు. ఈ సినిమాలో డానియల్ శేఖర్ పాత్ర పోషిస్తున్న రానా లుక్ ను 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్ధాయిలో విడుదల చేయనున్నారు.

More Related Stories