వెరైటీ టైటిల్ తో నెట్టింట్లో వైరల్ అవుతున్న టైటిల్ పోస్టర్?

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక టైటిల్ పోస్టర్ వైరల్ అవుతోంది.అదే డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది అన్న టైటిల్. జీవీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభం అయ్యింది.షార్ప్ మైండ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది ఒక ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాదులో జరిగింది.
అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడు నెహ్రూ, హీరో శివ కంఠమనేని, అలాగే పెళ్లి సందడి దర్శకురాలు గౌరీ రుణం కి, దర్శకుడు మల్లికార్జున్, నిర్మాత ఆచార్య శ్రీనివాస్ పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమాను గుడిపల్లి, కె రామచంద్రారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ కృష్ణన్ మాట్లాడుతూ.. నా దర్శకత్వంలో రాబోతున్న మూడో సినిమా ఇది.
నేను ఒక మంచి కాన్సెప్ట్ మరియు మంచి టీం తో మీ ముందుకు రాబోతున్నాను. ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేశాం. త్వరలోనే ఆర్టిస్టుల వివరాలు తెలియజేస్తాము అంటూ దర్శకుడు తెలిపారు. వెంకట కృష్ణన్ కమిట్మెంట్తో పనిచేసే డైరెక్టర్. ఆయన మీద పూర్తి భరోసాతో మా బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుంది. ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాత కె. రామచంద్రారెడ్డి అన్నాడు.